Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో నాలుగేండ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ మేనేజ్ మెంట్, విద్యార్థులతో ఎడ్యుకేషన్ కమిషనర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గుర్తింపు రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేనేజ్ మెంట్ కోరింది. ఈ క్రమంలో ఇరువురితో జరిపిన చర్చలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. పేరెంట్స్, మేనేజ్ మెంట్ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. డీఏవీ స్కూల్ రీఓపెన్‌పై కమిషనర్ సానుకూలంగా మాట్లాడారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.అయితే విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.