Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రావు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు బుధవారం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ రాశారు. అనంతరం రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు.
కేటీఆర్ రాపోలుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కేసీఆర్ తో ప్రగతి భవన్ లో రాపోలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రధాన పాత్ర వహించాలని కోరారు. జర్నలిస్ట్ గా పనిచేసిన ఆనంద భాస్కర్ రావు 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.