Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిక్కనూర్ : కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్ర శివారులో 44వ జాతీయ రహదారిపై ఉన్న స్థానిక టోల్ ప్లాజా వద్ద లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు టమాటా లోడుతో లారీ వెళ్తున్నది. అయితే లారీ డ్రైవర్ టోల్ ప్లాజా ఉన్న విషయాన్ని మరచి, అతి వేగంగా మద్యం మత్తులో లారీని నడపడంలో టోల్ ప్లాజా బూతులను వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు టోల్ ప్లాజా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. విషయం తెలుసున్న ప్రజాప్రతినిధులు టోల్ ప్లాజా కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ప్లాజా సిబ్బందికి ఎలాంటి రక్షణ చర్యలు లేవని అన్నారు. తమకు రక్షణ చర్యలు చేపట్టేంత వరకు విధులు బహిష్కరించాలని టోల్ ఫ్లాజా సిబ్బంది నిర్ణయించారు.