Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, నయనతార ఇటీవలే సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారు పెండ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవలలకు ఎలా జన్మనిస్తారంటూ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే సరోగసి వ్యవహారంపై విచారణ కమిటీకి తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన కమిటీ తాజాగా బుధవారం తమ నివేదికను సమర్పించింది.
ఈ నివేదికలో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులకు కలిగిన కవల పిల్లలు చట్టబద్ధంగానే సరోగసీ ద్వారా జన్మించారని నివేదికలో పేర్కొన్నారు. 2016 మార్చి 11న విఘ్నేశ్ శివన్ ను నయనతార పెండ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా కమిటీ తెలిపింది. ఈ క్రమంలో సరోగసీ కోసం నయన్ దంపతులు 2021 ఆగస్టులో ప్రక్రియను మొదలుపెట్టారని, ఇక నిబంధనల మేరకు అదే ఏడాది నవంబర్ లో వారు సరోగసీ కోసం ఒప్పందం కూడా చేసుకున్నారని వెల్లడించింది. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలోనే నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారని కూడా కమిటీ తేల్చిచెప్పింది. ఇక అద్దె గర్భం దాల్చిన సదరు మహిళకు వివాహమైందని కమిటీ నివేదికలో పేర్కొంది.