Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : మహారాష్ర్టలోని దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో 15 ఏండ్ల బాలికపై లైంగికదాడి చేశారన్న ఆరోపణలతో 28 ఏండ్ల క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేయగా, మరో క్యాబ్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడ కు క్యాబ్ డ్రైవర్ పారిపోయినట్లు భావిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుడు అభిమన్యు హన్స్‌రాజ్ స్వరోజ్ ను నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు.
వివరాల్లోకెళ్తే.. బాధిత బాలిక మాతుంగాలోని శ్రద్ధానంద్ మహిలాశ్రమంలో నివసిస్తోంది. అక్టోబర్ 22న రాత్రి బాలిక జూమీ స్టేషన్‌కు చేరుకుంది. ఆమెను ఒంటరిగా చూసి ఇద్దరు నిందితులు ఆమెతో మాట్లాడడం ప్రారంభించారు. అనంతరం బాలికపై లైంగికదాడికి నిందితులు ప్లాన్ చేశారు. బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని.. సహాయం చేస్తామని ఆమెను నమ్మించిన నిందితులు తమతో పాటు తీసుకెళ్లారు. ఆమెను సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.
అయితే లాడ్జ్ లోకి బాలికను తీసుకెళ్లే క్రమంలో క్యాబ్ డ్రైవర్ల నుంచి లాడ్జి నిర్వాహకులు ఏదైనా ఐడెంటిటీ పేపర్లు తీసుకున్నారా? లేదా అని పోలీసులుఆరా తీస్తున్నారు. లాడ్జి పాత్ర పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు.