Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిలిప్పీన్స్ : పరీక్షల్లో కొందరు విద్యార్థులు కాపీ కొట్టడం చేస్తుంటారు. ఎంత కఠినంగా వ్యవహరించినా వారు ఏదో రకంగా కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దాంతో బాగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఓ లెక్చరర్ వినూత్న ప్రయత్నం చేశాడు. విద్యార్థులకు యాంటీ చీటింగ్ అని రాసిన టోపీలను ఇచ్చాడు.
వివరాల్లోకెళ్తే.. ఫిలిప్పీన్స్‌లోని లెగాజ్‌పిలోని బికోల్ యూనివర్సిటీ కాలేజీలో మేరీ జారు మండేస్ ఆ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. విద్యార్థులు పరీక్ష రాయడానికి హాల్లోకి వెళ్లగానే.. విద్యార్థుల్ని అటుఇటూ చూడకుండా.. లెక్చరర్ మేరీ జారు యాంటీ చీటింగ్ అని రాసిన టోపీలను ధరించమని చెప్పారట. వెంటనే విద్యార్థులు లెక్చరర్ చెప్పినట్టుగా పేపర్లపై యాంటీ చీటింగ్ అని రాసుకుని.. వారికినచ్చిన ఆకారాల్లో టోపీల్లాగా చేసుకుని తలకు ధరించారు. ఇక మరుసటి రోజు.. వాళ్ల తలకు సరిపడేలా.. నచ్చినట్టుగా టోపీలను ధరించారట. విద్యార్థులు డిఫరెంట్‌గా ధరించిన టోపీలను ఆ లెక్చరర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు లెక్చరర్ ఐడియాను మెచ్చుకుంటున్నారు.