Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమను కొంతమంది ప్రలోభపెడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో
మోయినాబాద్ ఫామ్హౌస్పై దాడి చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ ఫామ్హౌస్పై దాడి చేసి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. తమను కొంతమంది ప్రలోభపెడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమాచారం అందించారని చెప్పారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ఆశచూపారని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో ఫామ్ హౌజ్‌పై రైడ్ చేశామన్నారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. అలాగే ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. వీరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.