Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట: మూడు రోజుల విరామం అనంతరం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. ముందుగా మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లల్ని రాహుల్ వదిలారు. అనంతరం పత్తి చేనులలో పనిచేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ పాదయాత్ర వెంట టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు.
గత అర్ధరాత్రి గుడెబల్లూర్‌కు చేరుకున్న ఏఐసీసీ నేత... ఈ రోజు ఉదయం మక్తల్ నియోజకవర్గం నుంచి పాదయాత్రను కొనసాగించారు. 167వ జాతీయ రహదారిపై 27 కిలోమీటర్ల నడక సాగించనున్నారు. గునుముకుల క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు.