Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఛార్‌థామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఇవాళ మూసివేశారు. బాబా కేదార్ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఆలయాన్ని మూసివేశారు. దీపావళి పండుగ తర్వాత సాధారణంగా కేదార్ క్షేత్రాన్ని మూసివేస్తారు. మళ్లీ ఎండాకాలం ప్రారంభంలో ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు కేదారీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయం మూసివేత నేపథ్యంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్ చేరుకున్నారు. స్థానిక పండితులు ఉత్సవమూర్తిని తీసుకువెళ్లారు. హర్ హర్ మహాదేవ్.. భం భం భోలే అంటూ భక్తులు తన్మయత్వంలో తేలిపోయారు.