Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా: కెనడాలోని బ్రాంప్టన్ సిటీ కౌన్సిలర్‌గా భారత సంతతికి చెందిన సిక్కు మహిళ నవ్‌జిత్ కౌర్ బ్రార్ ఎన్నికయ్యారు. దీంతో కౌన్సిలర్‌గా గెలుపొందిన టర్బన్ ధరించిన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. రెస్పిరేటరీ థెరపిస్టుగా పనిచేస్తున్న నవ్‌జిత్.. సిటీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా బ్రాంప్టన్‌లోని 2, 6 వార్డుల్లో పోటీచేశారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె.. ఈ ఎన్నికల్లో 28.85 శాతం ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన జర్మెయిన్ చాంబర్స్‌కు 22.59 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సుమారు 40 వేల ఇండ్లలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40 మంది పంజాబీలు పోటీచేశారు. నవ్‌జిత్‌తోపాటు మరో సిక్కు అభ్యర్థి గురుప్రతాప్ సింగ్ 227 ఓట్ల తేడాతో 9, 10 వార్డుల్లో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి కూడా సిక్కు కావడం విశేషం. కాగా, ప్రతి నాలుగేండ్లకు ఒకసారి కెనడాలో మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది.