Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో నోటి ద్వారా తీసుకునే టీకాను పంపిణీ చేయడం ప్రారంభించారు. బుదవారం షాంఘైలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యాక్సిన్‌లో ఉండే ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. నోటి ద్వారా టీకాను తీసుకోవడం వల్ల వైరస్ శ్వాసనాళంలోకి వెళ్లకముందే అంతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ నోటి టీకాను బూస్టర్ డోస్‌గా చైనా పంపిణీ చేస్తోంది.