Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అతి తక్కువ భద్రత ఉన్న దేశాలు ఇవేనంటూ గాల్లప్ శాంతి భద్రతల సూచీ 2022 వివరాలను వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది ప్రపంచంలో భద్రత అతి తక్కువగా ఉన్న దేశంగా తాలిబాన్ల పాలనలో ఉన్న అఫ్ఘనిస్థాన్ నిలిచింది. ఈ దేశం స్కోర్ 51గా ఉంది. ఆ తర్వాత గాబాన్ (54), వెనెజులా (55), డీఆర్ కాంగో (58), సియెర్రా లియోన్ (59 ) నిలిచాయి.
ఇక అత్యంత ఎక్కువ భద్రత ఉన్న దేశంగా సింగపూర్ 96 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తజకిస్థాన్ (95), నార్వే (93), స్విట్జర్లాండ్ (92), ఇండోనేషియా (92) నిలిచాయి.ఈ ఇండెక్స్ లో భారత్ 80 పాయింట్లతో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక కంటే భారత్ దిగువన ఉండగా.. బ్రిటన్, బంగ్లాదేశ్ కంటే ఎగువన ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో ప్రజల స్పృహ, నేరాలు, చట్టాల అమలు విషయంలో వారికి ఎదురైన అనుభవంపై ప్రశ్నల ఆధారంగా దేశాలకు ఈ ర్యాంకులను కేటాయించారు.