Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : నిన్నటి కరెన్సీ నోట్లపై దేవుళ్ళ బొమ్మల ముద్రణ చర్చ విస్తృతమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాటలకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ స్పందిస్తూ కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ఎందుకు ముద్రించకూడదని అడిగారు. అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలను ముద్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాస్తానని మాట్లాడిన నేపథ్యంలో మనీష్ తివారీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదన్నారు. నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలన్నారు. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయన్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు పోటీతత్త్వంతో కూడిన హిందుత్వాన్ని కేజ్రీవాల్ ప్రదర్శిస్తున్నారని పంజాబ్ కాంగ్రెస్ శాఖ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిచారు.