Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు : ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు పడిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. తన తండ్రి వైఎస్సార్ గతంలో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారని, అటువంటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.