Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నట్టు ప్రకటించింది. క్రికెట్ లో లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తున్నామని, మహిళలకూ పురుషులతో సమానంగా ఫీజులు చెల్లించాలని నిర్ణయించామని బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ మేరకు ట్వీట్ చేశారు.
చాలా కాలంగా మహిళా క్రికెటర్లకు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఎందుకంటే మహిళలు కూడా తమ శక్తి మేర రాణిస్తూ ఉంటారు. అలాగే భారత మహిళల జట్టు ఆసియా కప్ టోర్నీలోనూ అద్భుతంగా ఆడి ఇండియాకు ఏడవసారి కప్ ను అందించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పురుషులు ప్రస్తుతం బీసీసీఐ నుండి అందుకుంటున్న మ్యాచ్ ఫీజు వివరాలు చూస్తే, ఒక టెస్ట్ కు - 15 లక్షలు , ఒక వన్ డే కు - 6 లక్షలు మరియు టీ 20 కి అయితే 3 లక్షలు గా ఉన్నాయి. ఇవే వేతనాలు ఇకపై మహిళా క్రికెటర్లు అందుకోనున్నారు. ఇప్పటివరకు వారు వన్డే మ్యాచ్ కు రూ.2 లక్షలు, టెస్ట్ మ్యాచ్ కు రూ.4 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ.2.5 లక్షలను మహిళా క్రికెటర్లు అందుకునే వారు.