Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ కప్ లో భాగంగా సిడ్నీ స్టేడియంలో భారత జట్టు నిర్ధేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్లలో విక్రమ్ జిత్ సింగ్ ఒక్క పరుగు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. మ్యాక్స్ ఒడోద్ 16 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. లీడి (16) కూడా అక్సర్ బౌలింగ్ లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నెదర్లాండ్ జట్టు స్కోరు 12 ఓవర్లకు 62/3గా ఉంది.