Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలిసిందే. పాదయాత్రకు అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. రేపు అన్ని పిటిషన్లను కలిపి విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. న్యాయస్థానం మధ్యాహ్నం 12.30గంటలకు ఉత్తర్వులు జారీచేస్తే ఆ కాపీ రాకముందే పోలీసులు ఆంక్షలు విధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంక్షలు విధించడంతో పాటు రైతులు భోజనం చేసే ఫంక్షన్ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమని దౌర్జన్యం చేశారని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి 150 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది తమకు సమయం కావాలని కోర్టును కోరారు. పోలీసు ఆంక్షల కారణంగా తాము పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని. అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్లు కోరారు.