Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నాయకులే ఈ భారీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే... తెలంగాణ పోలీసు శాఖ విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటకు రావని బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. బీజేపీ పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది.