Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గూగుల్ మీట్, జూమ్ కాల్స్, స్కైప్ వంటి యాప్స్‌లో ఉన్న గ్రూప్ కాలింగ్ ఫీచర్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఆఫీసు మీటింగ్‌లను పెట్టుకునేందుకు ఈ ఫీచర్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. వినియోగదారుల ప్రైవసీకి భద్రత కల్పిస్తూ.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ కూడా ఇప్పుడు ఇలాంటి ఫీచర్‌నే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలువురు యూజర్లకు ప్రయోగాత్మకంగా అందించిన వాట్సాప్.. ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌ల్లో దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. మరి ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కాల్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి
- కాల్స్ సెక్షన్ ఓపెన్ అవ్వగానే.. అన్నిటికన్నా పైనా క్రియేట్ కాల్ లింక్ ( Create Call Link ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేయగానే కాల్ టైప్ అడుగుతుంది. అందులో వీడియో లేదా వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అలా కాల్ టైప్ సెలెక్ట్ చేసుకోగానే ఒక లింక్ క్రియేట్ అవుతుంది.
- ఆ లింక్‌ను ఇతరులకు పంపించేందుకు వీలుగా కాల్ టైప్ ఆప్షన్ కింద రెండు ఆప్షన్లు ఉంటాయి.
- షేర్ లింక్, కాపీ లింక్ అనే రెండు ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని.. అవసరమైన వారికి ఆ లింక్‌ను పంపించాలి.
- వాళ్లు సదరు లింక్‌పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు.
- ఒకవేళ సాంకేతికలోపం వల్ల వాట్సాప్ కాల్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఆ లింక్‌తో రీజాయిన్ అయ్యే సదుపాయం కూడా ఉంది.
- ఒక్కసారి క్రియేట్ చేసిన ఈ గ్రూప్ కాల్ లింక్‌ను 90 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.