Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుకు పసికూన జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ పై జింబాబ్వే ఒక రన్ తేడాతో గెలుపోందింది. దీంతో పాకిస్థాన్ కు రెండో ఓటమి చవి చూసింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జింబాబ్వే బాట్స్ మెన్లలో సేన్ విలియమ్స్ (31) అత్యధిక పరుగులు చేశాడు. 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో భరిలోకి దిగిన పాక్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయడంతో ఒక రన్ తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. పాక్ బ్యాట్స్ మెన్లలో మసూద్ (44) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజా మూడు వికెట్లు తీయగా బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు తీశాడు. మూజరాబాని, జోంగ్వే చేరో వికెట్ తీశారు.