Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఎట్టకేలకు పూర్తయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాన్ని సొంతం చేసుకున్నారు. 44కోట్ల డాలర్లతో ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్నారు. ట్విటర్‌ను దక్కించుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్‌వో, పలు విభాగాల అధిపతులను ఎలాన్ మస్క్ తొలగించారు. ట్విటర్ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి కోర్టు అక్టోబరు 28 తుది గడువుగా విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రక్రియను పూర్తి చేసే చర్యలను వేగవంతం చేసిన మస్క్..13 బిలియన్ డాలర్ల రుణాల కోసం ఇటీవలే బ్యాంకర్లతో భేటీ అయ్యారు. తాజాగా ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. అక్కడ అడుగుపెడుతున్న ఓ వీడియోను ఆయన గురువారం పోస్ట్ చేశారు. ట్విటర్‌లో తన ప్రొఫైల్‌ను 'చీఫ్ ట్విట్'గా మార్చారు. తన 'లొకేషన్'ను సైతం ట్విటర్ ప్రధాన కార్యాలయంగా మార్పు చేశారు.
ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి కోర్టు ఇచ్చిన గడువుకు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ వీడియోలో మస్క్ ఓ సింకును మోస్తూ కనిపించారు. 'ట్విటర్ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టా..'నంటూ ఆ వీడియోకు శీర్షికగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.