Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన ద్రవ్యోల్బణం సవాళ్లపై ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు - రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్‌బీఐ ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక రూపకల్పనపైనే నవంబర్ 3న జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ చర్చించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.