Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిర్దాక్షిణ్యంగా భార్యపై కారు ఎక్కించిన సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాను ముంబై పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కిషోర్ భార్య యస్మీన్ (35) కారును అడ్డగించబోగా, కమల్ కిషోర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడం.. ఆమె కింద పడిపోయినప్పటికీ ఆమె పై నుంచి కారును ముందుకు పోనివ్వడం తెలిసిందే. ఇందుకు సంబంధించి వీడియో గత వారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది. ఈ ఘటనలో కమల్ కిశోర్ భార్య యస్మీన్ కాలికి గాయాలయ్యాయి. కమల్ కిశోర్ ఓ మోడల్ తో కారులో ఉండడంతో యస్మీన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. తన భర్త వివాహేతర సంబంధంలో ఉన్నాడని, అక్కడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా ముందుకు పోనిచ్చాడంటూ యస్మీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేహతి డిస్కో, భూటియాప, ఫ్లాట్ నంబర్ 420, ఖల్లి బల్లి, శర్మాజీ కి లగ్ గయ్ చిత్రాలకు సహ నిర్మాతగా కమల్ కిశోర్ వ్యవహరించారు.