Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగింది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంతో ఈ కాలుష్యం మరింత పెరిగినట్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.. అక్టోబర్ 17 నుంచి నగరవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో వాయు నాణ్యతను పరీక్షిస్తోంది. ఈ నెల చివరి వరకు గాలి నాణ్యత పరీక్షలు కొనసాగనున్నాయి. సాధారణంగా క్యూబిక్ మీటర్ గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 అన్నది 34 మైక్రో గ్రాములు ఉండేది. దీపావళి రోజున ఇది 105 కు పెరిగింది. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే పీఎం 10 కణాలు కూడా దీపావళి రోజున 138 మైక్రో గ్రాములకు పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో ఇది 78 మైక్రో గ్రాములు ఉండేది.