Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ శుక్రవారం కీలక ప్రెస్ మీట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు 'పెద్ద సార్ ప్రెస్‌మీట్` అంటూ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో రేగా కాంతారావు ఒకరు. గురువారమే విలేకరుల సమావేశం అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రెస్ మీట్ జరగలేదు. అయితే కేసీఆర్ శుక్రవారం మీడియా ముందుకు రానున్నారని తెలుస్తోంది.