Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూపై డీఎంకే నేత సాధిక్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాంతో ఈ వ్యాఖ్యలపై డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి స్పందించారు. ఓ మనిషిగా, మహిళగా ఈ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. 'ఓ మహిళగా, సాటి మనిషిగా బహిరంగ క్షమాపణ చెబుతున్నాను.. ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసినవారు ఎవరైనా, ఏ పార్టీలో ఉన్నా దానిని సహించను.. దీనిని మా అధినేత స్టాలిన్, డీఎంకే కూడా సహించరు` అని కనిమొళి పేర్కొన్నారు. మరోవైపు, ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో సాధిక్ సైతం క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకున్నారని వివరణ ఇచ్చారు.