Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. 'పక్షికి విముక్తి లభించింది` అంటూ వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేయడం చర్చనియాంశమైంది. ట్విట్టర్ లోగోలో నీలి రంగు పక్షి ఉండటం తెలిసిందే. దాని గురించే ఆయన అన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఆయన ట్విట్టర్ ను సొంతం చేసుకోగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ వేటు వేశారు.