Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాకుళం : తండ్రి కర్మకాండలు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడి కొడుకు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలంలోని శుభలయ్య ఆర్‌ఆర్ కాలనీకి చెందిన దుబ్బారపు లలిత్ సాగర్ (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి, ఆర్‌ఎంపి వైద్యుడు సూర్యారావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం లలిత్ సాగర్ తన తండ్రి కర్మకాండలను చేసేందుకు గొట్టా బ్యారేజీ వద్దకు వచ్చారు. వంశధార నదిలో అతను స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. వెంటనే గమనించిన మత్స్యకారులు లలిత్ సాగర్‌ను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. సమాచాం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానిక గజ ఈతగాళ్లతో లలిత్ సాగర్ కోసం గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు 9 నెలల చిన్నారి ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో తండ్రీకుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.