Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : దక్షిణ ఫిలిప్పిన్స్‌లో సంభవించిన నాల్గే తుఫాను వల్ల సమారు 31 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో పదిమంది మిండనావో ద్వీపంలోని డాటు బ్లా సిన్సువాట్ పట్టణానికి చెందినవారని... స్థానిక ప్రభుత్వ అధికారి నగుయిబ్ సినారింబో శుక్రవారం తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా.. కొటబాటో నగరానికి చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో మూడు మృతదేశాలను వెలికితీసినట్లు అధికారి వెల్లడించారు. కొండచరియలు విరిగినపడిన ఇతర ప్రాంతాల్లో కూడా రెస్క్యూటీమ్స్ తనిఖీలు చేపట్టాయని చెప్పారు.
ఇక నాల్గే తుఫాన్ ఉత్తర ఫిలిప్పీన్స్ వైపు పయనిస్తోందని, శనివారం లేదా ఆదివారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ తుఫాను వల్ల వదరలు, కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల్లోని ఐదు వందల మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించినట్లు సివిల్ డిఫెన్స్ కార్యాలయం వెల్లడించింది.