Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీకి గట్టిఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత ఆ పార్టీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌లో చేరారు. గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా శుక్రవారం తిరిగి సొంతగూటికి చేరారు. గుజరాత్ పీసీసీ చీఫ్ జగదీష్ ఠాకూర్ మహేంద్రసింగ్ వాఘేలాను పార్టీలోకి ఆహ్వానించారు. 2012లో బయద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మహేంద్రసింగ్ వాఘేలా 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నుంచి వైదొలిగారు.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసిన అనంతరం ఆయన తండ్రి వాఘేలాతో పాటు ఆరుగురు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్‌ను వీడిన మూడు నెలల్లోనే మహేంద్రసింగ్ వాఘేలా బీజేపీలో చేరారు. ఇక విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని మహేంద్రసింగ్ పేర్కొన్నారు. తాను బీజేపీలో ఇమడలేకపోయానని చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరినా గత ఐదేండ్లలో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నానని అన్నారు. ఇక కాంగ్రెస్ నేతగా పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తానని మహేంద్రసింగ్ వాఘేలా స్పష్టం చేశారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో వాటిని నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.