Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని...అదే పని ఇప్పుడు తెలంగాణలోనూ చేస్తున్నారన్నారు. ఆ దొంగలకు వేరే పని తెలీదన్నారు.ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పారు. బీజేపీ, మోడీనో కాదు.. ఎవరైనా ఇలాంటి పనిచేస్తున్నప్పుడు ప్రజలు, మీడియా ప్రశ్నించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ల ఆలోచనలు తనకు ఇష్టమని.. వారు తనను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. కేసీఆర్ వైఖరి కొందరికి నచ్చలేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆయన్ని అర్థం చేసుకొని కేసీఆర్ వెంట ఉంటారని అన్నారు.
ఇక 'మా` అధ్యక్షుడు విష్ణు పదవిని అలకరించి ఏడాది మాత్రమే అయిందని, మరో ఏడాది ఆయనకు సమయం ఉందని అన్నారు. ఎన్నికైన వాళ్లకు పనిచేసే బాధ్యత ఉంటుందని, విష్ణు అధ్యక్షుడిగా పనిచేశారా? లేదా? అన్నది 'మా` సభ్యులు అందరికీ తెలసని అన్నారు. 90 శాతం పనులు చేశామని ప్రకటించడం వల్ల ఆ పనులు పూర్తయినట్లు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పై ఆలోచిస్తానన్నారు.