Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గాజులరామారంలో డ్రగ్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బాలానగర్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి బ్లాక్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన మనోజ్, రామారామ్‌లు ఉపాధి కోసం కొన్ని రోజుల క్రితం నగరానికి వలస వచ్చి నార్సింగి ప్రాంతంలో నివాసిస్తున్నారు. రాజస్థాన్‌లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ ఇద్దరు అక్కడి నుంచి తక్కువ ధరకే బ్లాక్ హెరాయిన్‌ను కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు గాజులరామారంలోని అన్నపూర్ణాదేవి ఆలయం వద్ద డ్రగ్‌ను విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినామని పోలీసులు వెల్లడించారు.