Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనిపట్ : పెండ్లికి నిరాకరించాడని ఓ యువకుడిపై యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం యువకుడు తీవ్ర గాయాలతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకెళ్తే.. మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన శ్యామ్ అనే యువకుడు తన తల్లిదండ్రులు చనిపోవడంతో మేనత్తతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులయ్యారు. అయితే రెండ్రోజుల క్రితం ఆ యువతి తన తల్లితో కలిసి శ్యామ్ ఇంటికి పెండ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్లింది. అయితే శ్యామ్ మేనత్త ఆ పెండ్లికి నిరాకరించింది. అంజలికి ముందే పెండ్లి జరిగిందని, అతడి నుంచి విడిపోయి మళ్లీ పెండ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని శ్యామ్ మేనత్త.. శ్యామ్ కు చెప్పింది. దాంతో పెండ్లి చేసుకోలేనని అంజలికి శ్యామ్ చెప్పేశాడు. అయినా శ్యామ్‌ను అంజలి ఫాలో అవుతూనే ఉంది. రెండ్రోజుల క్రితం రోడ్డుపై ఉన్న శ్యామ్‌పై ఆమె యాసిడ్ పోసి పారిపోయింది. దాంతో శ్యామ్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అంజలిని అదుపులోకి తీసుకున్నారు.