Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం బాగా చల్లబడింది. జనం చలికి వనికిపోతున్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 14.2 డిగ్రీలు, నిజామాబాద్ లో లో 17.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 18.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతోందంటున్నారు. టెంపరేచర్ పడిపోవటంతో చాలా ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.