Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రామంతపూర్ శ్రీచైతన్య పాఠశాలలో గురువారం నిర్వహించిన ''నాసా'' కిట్ల పంపిణీ కార్యక్రమానికి డా|| జగదీష్ బాబు-ప్రిన్సిపాల్ సైంటిస్ట్-సీఎస్ఐఆర్-ఐఐసీటీ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ''నాసా'' కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయవచ్చిని అన్నారు. అలాగే ఏజీఎం సతీష్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో విద్యార్థులను రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి జోన్ ఎగ్జిక్యూటీవ్ డీన్ సనమ్ జీ, కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, వైస్-ప్రిన్సిపాల్ శ్రీ కీర్తి, డీన్ నాగరాజు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.