#BREAKING #IndiGo flight 6E-2131 (Delhi to Bangalore) grounded at Delhi airport after a suspected spark in the aircraft | Watch @Atul_Bhatia80 pic.twitter.com/IwwRfdACQq
— shashwat bhandari (@ShashBhandari) October 28, 2022
Authorization

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాద తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానం టేకాఫ్కు ముందు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలను గుర్తించిన వెనుక ఉన్న పైలట్ సమాచారం ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వెంటనే ప్రయాణీకులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దింపేశారు. విమానంలోనివారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం రాత్రి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ-2131 విమానం 177 ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్నది. అయితే రన్‌వైపై టేక్‌ఆఫ్ అవుతుండగా ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. విమానంలో కూర్చున్న ప్రయాణికులు కిటికీలోంచి వాటిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోనే విమానాన్ని నిలిపివేశారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వారందరిని ప్రత్యామ్నాయ విమానంలో గమ్యస్థానికి తరలించారు.