Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. టేకులపల్లికి చెందిన ఐదుగురు వ్యక్తులు అన్నా షరీఫ్ దర్గాకు వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో కేసముద్రం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఐదుగురు టేకులపల్లి వాసులు దర్గా దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు మార్గమధ్యలో లిఫ్ట్ అడిగి కారెక్కారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మిగతా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో లిఫ్ట్ అడిగి ఎక్కిన లలిత, సురేష్‌తోపాటు టేకులపల్లికి చెందిన బద్రు నాయక్, అచ్చాలి ఉన్నారు.