Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఉప్పర్‌పల్లి ప్రకాష్ నగర్ కాలనీలో అనంత కుమార్ అనే వ్యాపారవేత్త ఇంట్లో దుండగులు చోరికి తెగబడ్డారు. ఇంట్లో 12 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణకు గురైంది. కుటుంబం అంతా ఇంట్లో నిద్రిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. దొంగల అలజడి విని ఇంటి యజమాని అనంత కుమార్ నిద్రలేవగా.. అతడిని చూసి దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ క్రైమ్ టీమ్, క్లూస్ టీమ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.