Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫిలిప్పీన్స్ లో తుపాను విలయం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడి దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో 42 మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గల్లంతయ్యారు. కొంత మంది ఇళ్ల పైకప్పులపై చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఈ కుండపోత వర్షాలకు చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరు కొట్టుకుపోయారు. ఈ భారీ వర్షాలకు నాల్గే సైక్లోన్ నే కారణంగా తెలుస్తోంది. వరదలో చిక్కుకున్న 5వేల మందిని కోస్ట్ గార్డు, పోలీసులు, వాలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే రాజధాని మనీలాతో సహా కొన్ని ప్రాంతాల్లో తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఫిషింగ్, కార్గోబోట్లు, ఫెర్రీలను నిషేధించారు.
తుపాను మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యయాయి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరకుండా వరదల్లో చిక్కుకుపోయారు. సెంట్రల్ సిబూ నగరంలో స్కూళ్లు మూసివేశారు. ఈ దేశం పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉంది. దాంతో తరుచు తుపానుల బారిన పడుతుంది. సంవత్సరానికి కనీసం 20 తుపానులు ఫిలిప్పీన్స్‌ను దెబ్బతీస్తాయి. రీసెంట్ గా వేసవి కాలంలో కూడా ఇక్కడ తుపానులు వస్తున్నాయి.