Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 1,65,901 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,574 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే శుక్రవారం ఒక్కరోజే 2,161 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే 9 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 18,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,50,662కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 5,29,008కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.62 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.