Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ర్టంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఈ ఆపరేషన్ లో 'కొబ్బరి నీళ్లు తీసుకురండి` అనే కోడ్ వర్డ్ ను ఉపయోగించినట్లు సమాచారం. పోలీసులు ఫాంహౌస్ లోకి ప్రవేశించవచ్చని సంకేతం ఇవ్వడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ పదాన్ని ఉపయోగించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. ఈ కోడ్ వర్డ్ వినిపించగానే అన్నివైపుల నుంచి ఫాంహౌస్ లోపలికి వెళ్లాలని అధికారులు ప్లాన్ చేశారని సమాచారం. రహస్యంగా అమర్చిన కెమెరాలను మధ్యాహ్నం 3:05 నిమిషాలకు ఆన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రామచంద్ర భారతి, నందుల మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ల వివరాలనూ పొందుపరిచారు.