Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పితృవియోగంతో బాధలో ఉన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి.. పితృవియోగ బాధ నుంచి అజారుద్దీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అజారుద్దీన్ తండ్రి మహ్మద్ యూసుఫ్ సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 18న కన్నుమూశారు.