Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్థంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల పునీత్ రాజ్ కుమార్ ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని తయారు చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. నాలుగు నెలలపాటు కష్టపడి తయారు చేసిన ఈ విగ్రహాన్ని త్వరలోనే బెంగళూరుకు తరలించనున్నారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు.