Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : తన మనవరాలు పెండ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని
ప్రముఖ నటి జయ బచ్చన్ అన్నారు. తాజాగా ఆమె తన మనవరాలు నవ్య నవేలి నందతో కలిసి 'వాట్ ది హెల్ నవ్య` అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. నవ్య నవేలి నంద పెండ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చినా తనకు ఎటువంటి ఇబ్బంది చెప్పారు. ప్రజలు తన నుంచి ఇలాంటి కామెంట్లు రావడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారని.. కానీ రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగాలంటే శారీరక ఆకర్షణ చాలా ముఖ్యమైనదని చెప్పారు. తమ కాలంలో తాము ప్రయోగాలు చేయలేకపోయాము.. కానీ నేటి తరం వారు ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు.
ఇప్పటి జెనరేషన్ వారి బెస్ట్ ఫ్రెండ్స్ ను పెండ్లి చేసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. బెస్ట్ ఫ్రెండ్ తో బిడ్డను కనడంలో కూడా తప్పులేదన్నారు. ఈ జెనరేషన్ పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెండ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని జయ అన్నారు.