Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులోని విధాన సౌధలో నవంబర్ 1న నిర్వహించనున్న కన్నడ రాజ్యోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్‌కు అక్కడి ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. అలాగే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి ఎన్టీఆర్ వేదికను పంచుకోనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అదే వేదికపై కర్నాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్‌ను 'కర్నాటక రత్న`గా ప్రకటించబోతోంది. పలు సేవా కార్యక్రమాల ద్వారా పునీత్ రాజ్‌కుమార్ ప్రజలల్లో తనకంటూ చెరగని ముద్ర వేశారు. 2021 అక్టోబరు 29న పునీత్ వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నేడు ఆయన మొదటి వర్ధంతి.