Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురుని రిమాండ్ కు తరలించేందుకు అనుమతిస్తూ.. ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ ను కొట్టివేసింది. పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్ ను అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందు హాజరు కావాలని హై కోర్టు ఆదేశించింది. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని పేర్కొంది.