Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామరెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కళ్ళకలక కలకలం రేపింది. జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఒకేసారి 67 మందికి కళ్లకలక సోకింది. ఈ గురుకులంలో 447 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే మూడు రోజుల కిందట ఇద్దరు విద్యార్థినులకు సోకిన కళ్లకలక వేగంగా ఇతర విద్యార్థినులకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది.