Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసు దర్యాప్తును మునుగోడు ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. పోలీసుల దర్యాప్తుపై ధర్మాసనం స్టే విధించింది. పోలీసుల దర్యాప్తును మునుగోడు ఎన్నికలు పూర్తయ్యేవరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో నిందితుల రిమాండ్‌కు స్టే వర్తించదని పేర్కొంది. అలాగే 8 మంది ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ పిటిషన్ వేసింది.