Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ సూపర్-12 మ్యాచ్ కు సిడ్నీ ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, అది ఎంతటి తప్పుడు నిర్ణయమో కాసేపటికి తెలిసొచ్చింది. లంక బౌలర్ల ధాటికి కివీస్ జట్టు 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (1), డెవాన్ కాన్వే (1) పేలవరీతిలో లంక స్పిన్నర్లకు తలవంచారు. ఫిన్ అలెన్ ను మహీశ్ తీక్షణ అవుట్ చేయగా, కాన్వే వికెట్ ధనంజయ డిసిల్వా ఖాతాలో చేరింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ కసున్ రజిత ఓ అద్భుతమైన బంతితో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8) ను పెవిలియన్ చేర్చడంతో కివీస్ జట్టు మూడో వికెట్ చేజార్చుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 76 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 41, డారిల్ మిచెల్ 22 పరుగులతో ఆడుతున్నారు.