Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు మరోసారి గుజరాత్‌లో ప్రమాదం జరిగింది. సెమీ-హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా వల్సద్ సమీపంలోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు ఒక అవురావడంతో రైలు ముందు భాగం దెబ్బతింది. కప్లుర్ కవర్, బీసీయూ కవర్ దెబ్బతిన్నాయి. వాటర్ సిస్టమ్ కూడా దెబ్బతినడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. ఉదయం జరిగిన ప్రమాదం అనంతరం సుమారు 15 నిమిషాల పాటు అతుల్ రైల్వే స్టేషన్‌లోనే రైలును నిలిపివేశారు. కాగా, ఇటీవల ఇదే రూటలో వందే భారత్ రైలు ట్రాక్‌పై అక్టోబర్ మొదటి వారంలో రెండు సార్లు ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. మరిన్ని వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.